బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము

 బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం  తమ రాష్ట్రపతి అభ్యర్థినిగా  ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.  ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం,  ఆమె మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్ నుంచి 2000, 2009లో బిజెపి టిక్కెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు..

 బీజేపీ తరపున షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, 2000లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్యకాలంలో వాణిజ్యం, రవాణా శాఖ, ఆ తరువాత ఫిషరీస్, జంతు వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ముర్ము జార్ఖండ్  మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది..ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి ఈ క్రమంలోనే చివరకు బీజేపీ పార్లమెంటరీ బోర్టు సమావేశంలో ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *