ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు మట్ట ప్రసాద్

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ మండల పరిధిలో కొత్తపేట గ్రామంలో ముళ్ళపూడి (తాతయ్య ) అనే రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకోని వరి పైరు వేచినాడు. అయితే నివర్ తుపాను కారణంగా వర్షలకు నోటికాడికి వచ్చిన పంట కళ్ళముందు పడిపోయి మొలక రావటం చూసి తట్టుకోలేక, తెచ్చిన అప్పులు ఎలా తెరుతాయి అనే మనస్సు స్థాపంతో బలవంతంగా పురుగులు మందు త్రాగి చనిపోయారు.అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ఓలేటి ఆదిశేషు(60) సోమవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు . 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంట వేయగా, నివర్ తుఫాన్ ధాటికి పంట మొత్తం దెబ్బతిని మొలకలు వచ్చాయని, పొలంలో చల్లిన మినుము విత్తనాలు కూడా మొలకెత్తలేదని, చేసిన అప్పులు(సుమారు 3 లక్షలు) తీర్చలేక సోమవారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.రైతులకు అండగా బిజెపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అండగా ఉంటారని జిల్లా అధ్యక్షులు చెప్పారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమం బిజెపి అవనిగడ్డ మండల అధ్యక్షులు భోగాది చంద్రశేఖర రావు మరియు జీవి నగర్ ఆయిల్  బిజెపి రాష్ట్ర కమిటీ మెంబర్ రమాదేవి గారు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు బిజెపి మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్న