పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నేలంపాడు గ్రామంలో పర్యటించిన భూమా కిషోర్ రెడ్డి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాగలమర్రి మండలం నేలంపాడు గ్రామంలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజల చాల కష్టాలు పడుతున్నారు. ఒకవైపు కరెంట్ కోతలు మరోవైపు కరెంటు బిల్లులు పెంచడం, డ్రైనేజ్ సమస్యలు, గ్రామాల్లో రాకపోకలకు రోడ్లు లేవు ఇలా అనేకమైన సమస్యలతో పల్లె ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే. ఎంఎల్ఏ మాత్రం ఇంట్లో కూర్చొని చోద్యం చూస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజల సమస్యలకు పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.