భద్రాచలంలో 1005 కేజీల గంజాయి ప‌ట్టివేత‌.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం నిన్నటి రోజు మద్యాహ్నం 03:00 గంటల సమయంలో బద్రాచలం పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో, ఎస్.ఐ మదు ప్రసాద్ తమ సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక లారీ నం RJ17GA307 గలది అనుమానాస్పదంగా కన్పించగా దానిలో ఉన్న లారీ డ్రైవర్ , క్లినర్ లను మరియు వారిని తనివీ చేయగా ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినారు. ఈ తనిఖీ లో ఏం వద్ద 1005 కేజీల గంజాయి లభించింది . దీని విలువ సుమారు 2,01,00,000 /రూపాయలు ఉండును ముద్దాయిలను విచారించగా వారి పేర్లు 1 సత్యనారాయణ ప్రజాపతి , 2. కరణ్ సింగ్ అని వీరిద్దరూ దండం గ్రామము , అగర్ జిల్లా , మధ్య ప్రదేశ్ కు చెందిన వారని చెప్పినారు. వీరు ఈ గంజాయిని సీలేరు దగ్గర గల అడవి ప్రాంతం నుండి మధ్యప్రదేశ్ కు తీసుకు వెళ్తున్నారని చెప్పినారు. సీలేరు దగ్గర ఒడిశా ప్రాంతానికి చెందిన వసీం అనే వ్యక్తి దగ్గర అట్టి గంజాయిని కొని మద్యప్రదేశ్ లోని కొనుగోలుదారులైన ఈశ్వర్ సింగ్ , ప్రేమ్ సింగ్ ల వద్దకు అట్టి గంజాయిని చేరవేస్తున్నామని చెప్పినారు . ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి ఎస్.ఐ మదు ప్రసాద్ మరియు సిబ్బంది. పాల్గొన్నారు . సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం.