చెక్ బౌన్స్ కేసులో ధోనీని నిర్దోషిగా ప్రకటించిన – బెగూసరాయ్ కోర్టు
చెక్ బౌన్స్ వివాదంలో చిక్కుకున్న టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి ఊరట లభించింది… టీమ్ఇండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్న సమయంలో.. బిహార్‌కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రమోటర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ.. ధోనీ ప్రమోటర్‌గా ఉన్న కంపెనీ నుంచి ఎరువులను కొనుగోలు చేసింది. అనంతరం ఆ ఎరువుల్లో నాణ్యత కొరవడిందని కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించింది. ఫెర్టిలైజర్ కంపెనీ.. ఆ ఎరువులను రిటర్న్ తీసుకొని.. రూ. 30 లక్షల చెక్కును ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీకి అందజేసింది. అయితే ఆ చెక్కు బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో ఎరువుల కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న ధోనీతో పాటు మరో నలుగురికి లీగల్ నోటీసులు పంపింది ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. అందులో ధోనీ పేరు కూడా చేర్చారు. ఈ కేసుపై విచారించిన బెగూసరాయ్ కోర్టు.. ధోనీతో పాటు మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది
.