ఐపిఎల్ మలివిడత షెడ్యుల్ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.

కరోనా కారణంగా గత ఏడాది ఐపిఎల్ లీగ్ ను యూఏఈ లో నిర్వహించగా. ఈ ఏడాది ఇండియాలో బయోబబుల్ ఏర్పాటు చేసి నిర్వహించినా కూడా కరోనా చొరబడటంతో.. సీజన్ మధ్యలోనే నిలిచిపోయింది. మలి విడత ఐపీఎల్‌ మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించబోతునట్లు ఇప్పటికే బీసీసీఐ అధికారులు స్పష్టం చేశారు. తాజాగా ఐపీఎల్‌ కొత్త షెడ్యూల్‌ కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 19న యూఏఈలో మ్యాచ్ లను పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్ ను అక్టోబర్ 15న నిర్వహించబోతున్నారు. ఈ మొత్తం మ్యాచ్‌ లను కూడా గత ఏడాది మాదిరిగా బయో బబుల్‌ ను ఏర్పాటు చేసి నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు.