ధోనీ×కోహ్లీ నేడే రసవత్తర పోరు..

ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఈరోజు ఆసక్తికర పోరు జరగనుంది. మాజీ టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోటీ పడనున్నాయి. ఐపిఎల్ అభిమానులు ఈపోరు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి 8 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో బెంగళూరు ఉండగా.. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన చెన్నై ఈ సారి ఆడిన 4 మ్యాచుల్లో 3 విజయాలు ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇరు జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్ విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది. ఎవరు నెగ్గితే వారు పాయింట్స్ పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది