బందరులో మోత మోగితే వాతే!

కృష్ణా జిల్లా SP శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాలు మేరకు బందరు ట్రాఫిక్ DSP భరత్ మాతాజీ ఆధ్వర్యంలో
భారీ శబ్దాలు చేస్తూ వాహనాలపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగచేస్తున్న కొంతమంది వాహణదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వాహనాలకు సంబంధించి కంపెనీ తయారీతో కాకుండా ఎక్కువ శబ్దం వచ్చేవిధంగా *సైలెన్సుర్లు మార్చుకుని పట్టణంలో శబ్ద కాలుష్యం కలుగజేస్తున్న కొంతమంది వాహనదారులు ముఖ్యంగా యువత భారీ శబ్దాలు చేస్తూ అతివేగంగా బందరు రోడ్లపై విచ్చల విడిగా తిరగడాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు వారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనగా *Sound Level Meter ను ఉపయోగించి మోటారు *వాహన చట్టం సెక్షన్ 190 (2) ప్రకారం 80 డేసిబుల్స్ శబ్ధ కాలుష్యం దాటిన వాహనదారులకు ఒక్కొక్కరికి Rs 1000 రూపాయలు జరిమానా విధించారు. ఈ  సందర్భంగా ట్రాఫిక్ SI రాజేష్ మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని కాబట్టి వాహన దారులు ప్రతి ఒక్కరూ మోటారు వాహనచట్ట నిబంధనలు పాటించాలని తెలిపారు. పరిస్థితి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.