దోబీ ఘాట్ ను ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి దోబీ ఘాట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రజకులు స్థానిక వైఎస్సార్ సీపీ       నాయకులు కోడూరు రామచంద్రారెడ్డి దృష్టికి రజకుల పడుతున్న ఇబ్బందులను తీసుకురావడంతో కోడూరు రామచంద్రారెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి యనకండ్ల గ్రామ రజకుల సమస్యలు వివరించి దోబీఘాట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టడం జరిగింది. పూర్తి అయిన దోబీ ఘాట్ ను మంగళవారం బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభిం చడం జరిగింది. ఈ సందర్భంగా యనకండ్ల గ్రామ రజకులు ఎమ్మెల్యే కి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి దోబీ ఘాట్ త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి మరియు యనకండ్ల వైఎస్ఆర్సిపి నాయకుడు కోడూరు రామచంద్రా రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అలాగే ప్రస్తుత ప్రభుత్వం రజకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే వెంట బనగానపల్లె వైఎస్ఆర్సిపి నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ బనగానపల్లె పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సాదుల శివశంకర్ రెడ్డి మరియు కోడూరు వెంకటసుబ్బారెడ్డి, పాపసాని గోపాల్ రెడ్డి, బీసీ మహేశ్వర రెడ్డి, బొబ్బల రామ్మోహన్ రెడ్డి, బీసీ మధుసూదన్ రెడ్డి, చాకలి సాలన్న, చాకలి ఉసేని, MPTC సుబ్బారాయుడు, YSRCP కార్యకర్తలు, అభిమానులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.