కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

కథా నాయకుడిగా కదం తొక్కుతూ ప్రజా నాయకుడిగా హిందూపురంలో ప్రజా పాలనకు ప్రాణం పోస్తూ… తండ్రికి తగ్గ తనయుడి గా… బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ముందుకు సాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కడప, టీడీపీ జిల్లా కార్యాలయంలో కడప నగర అధ్యక్షుడు శివకొండా ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు గారు పాల్గొని కేక్ కట్ చేసి.. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు నందమూరి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ…

నేటి తరంలో పౌరాణిక పాత్రలకి ప్రతిరూపం. అనితర సాధ్యమైన నటనకు ప్రతిభింభం. చెల్లి ప్రేమకి దాసోహంతో ముద్దుల మావయ్యగా..
కొంటె చేష్టల బాల కృషుడి గా… అన్యాయన్ని ఎదిరించే సింహుడి నర సింహునిగా.. సీమ రాజసం చెప్పిన సమర సింహునిగా.. చరిత్ర పుటలో నిలిచిన లెజెండ్ గా.. వెండి తెరపై నవరస నటనని పండించే కళాపోషణ… బోళా శంకరుడిగా మనస్తత్వం గల వారని కొనియాడారు ప్రజాక్షేత్రంలో రెండో సారి ప్రజాశీస్సులు పొందిన అధినాయకుడు.శతాధిక చిత్రాలతో చిత్ర సీమలో సుస్థిర స్థానం కైవసం చేసుకుని అశేష ప్రజాభిమానం సొంతం చేసుకున్న నందమూరి నట కిషోరం… ఒకే హీరో నటించిన ఆరు సినిమాలు వరుసగా బాక్సాఫీసును షేక్చ యడమంటే మాటలు కాదు. ఆ ఆరు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయి హిట్ కొడితే ఇంకెలా ఉంటుంది. అలాంటి సంఘటనే 1986లో చోటుచేసుకుంది. అందుకే అక్షయ నామసంవత్సరం కాదు ఇది బాలయ్య నామ సంవత్సరం అని కీర్తించబడిందని అన్నారు బసవతారకం ఆంగ్లో- ఇండియన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి సేవలను అందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిఉన్నారని అన్నారు.ఈ వేడుకల్లో నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, టీడీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, నబికోట్ శ్రీనివాసులు, కొండా సుబ్బయ్య, ఎన్.ఎస్.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.