ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయం…అదిరిపోయిన బాలకృష్ణ 106వ చిత్ర మొదటి గర్జన

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కలయికలో సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత రాబోతున్న NBK106వ చిత్రం యొక్క మొదటి గర్జనను బాలకృష్ణ 60వ పుట్టినరోజు పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈరోజు 7 గంటలకు విడుదల చేశారు. ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా..! అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కి, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు పూనకాలతో ఊగిపోవడం ఖాయం. లాక్ డౌన్ ముందు, వారం రోజులపాటు చిత్రీకరించిన ఒక ఫైట్ సీన్ ని, టీజర్ రూపంలో కట్ చేసి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ అందించారు. ఈ వీడియో లో బాలయ్య వేషధారణ చూస్తుంటే సింహా, లెజెండ్ ను మించే సినిమా రాబోతుంది అని అర్థమవుతుంది. కాగా ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.