రత్నగిరి పైకి ఆటోల రాకపోకలకు పర్మిషన్ ఇవ్వడం పట్ల హర్షం
రత్నగిరికి ముగ్గురు భక్తులతో ఆటోలో వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడం పట్ల శ్రీ సత్య దేవ ఆటో యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆటో యజమానుల ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర రోడ్డు భవన శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తీసుకు వెళ్లడం వారి సహకారంతో కమిషనర్ జవహర్ దృష్టికి తీసుకువెళ్లి పర్మిషన్ ఇచ్చేలా కృషి చేసినందుకు ఆటో యూనియన్ సభ్యులు సంతోషం వ్యక్తపరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో ఆజాద్ లు మంగళవారం నుండి ఆటోల రాకపోకలు కొనసాగించేలా పర్మిషన్ ముంజూరు చేసినందుకు శ్రీ సత్యదేవ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు కుమార్ రాజా,ఆటో సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.