ఐక్యరాజ్య సమితి యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌

ఐక్యరాజ్య సమితి యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొనసాగనున్నాడు. రికార్డుస్థాయిలో 20వ ఏడాది కూడా అంబాసిడర్‌గా మాస్టర్‌ ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాలపాటు యునిసెఫ్‌తో ప్రయాణించడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. 2003లో భారత్‌లో పోలియో నిరోధక కార్యక్రమానికి సచిన్‌ను తొలిసారి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు.