వాణిజ్య పన్నుల జీవోకు తాత్కాలిక బ్రేక్‌.

రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ గతంలో ఇచ్చిన జీవోను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి జీవో ఇచ్చే వరకు గతంలో ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు,వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.