ఏపిలో నేటి నుండి కర్ఫ్యూ వేళల్లో సడలింపు.

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండగా.. నేటి నుండి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు. అనగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కొత్త నిబంధనలు ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు. మరోవైపు కర్ఫ్యూ సడలింపులతో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి.