ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురు దెబ్బ.

పీఆర్స వ్యవహారంపై ఈ వార్ మరింత ముదురుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే. ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ అమలుకు అడుగులు వేస్తోంది. జీతాలు, పింఛన్ బిల్లుల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి సర్క్యులర్ జారీచేసింది.   ఆ సర్క్కులర్‌లో కొత్త పే స్కేలు ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, పెన్షర్లకు పింఛన్లు చెల్లించాలని ఆదేశించింది. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను చెల్లించాలని పేర్కొంది. అంతేకాదు ప్రభుత్వశాఖలు, విభాగాలు, యూనివర్శిటీలు, సొసైటీలు, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఫుల్‌ టైమ్, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది.ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది. జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.