డిల్లీ పర్యటనలో ఏపి సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు డిల్లీ పయనమయ్యారు. ఈరోజు హోంమంత్రి అమిత్‌ షా తో పాటు కేంద్ర జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇప్పటికే డిల్లీ చేరుకున్న సీఎం జగన్ కు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు.