మరోసారి భేటీకానున్న ఏపీ కేబినెట్

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈ నెల 19న సమావేశం కానుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా నివారణ, చికిత్స, కొత్త జిల్లాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలు, ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇటీవల తీసుకువచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు మొదలైన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపైనా ఈ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపనున్నారు.