రేపటినుండి సత్యదేవుని దర్శనాలకు అనుమతి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని భక్తులు దర్శించుకునేలా అనుమతులు ఇచ్చినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. శుక్రవారం నుండి ప్రతీ రోజు ఉదయం 6.00 గంటల నుండి 11.30 గంటల వరకు కోవిడ్మ రియు ప్రస్తుతం ఉన్న SOP నిబంధనలు పాటిస్తూ భక్తులను శ్రీ స్వామివారి దర్శనములకు, శ్రీ స్వామివారి ఆర్జిత సేవల (వ్రతములు, కల్యాణములు,) మొదలగు సేవలకు, కేశ ఖండనకు అనుమతించబడునని తెలియజేశారు.