వెంకీ మామ చాలెంజ్ ను తనదైన శైలిలో స్వీకరించిన అనిల్ రావిపూడి..!

బి దా రియల్ మాన్ అంటూ డైరెక్టర్ సందీప్ వంగ మొదలుపెట్టిన ఛాలెంజ్, తన నుంచి రాజమౌళి కి, రాజమౌళి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి ,రామ్ చరణ్ కి మెగాస్టార్ చిరంజీవి కి, వెంకటేష్ కి ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం పాక్కుంటూ పోతుంది..! అదే ఛాలెంజ్ ని విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి ని, వరుణ్ తేజ్ ని, సూపర్ స్టార్ మహేష్ బాబు ని నామినేట్ చేశారు. .!

విక్టరీ వెంకటేష్ వేసినా ఛాలెంజ్ ని అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో స్వీకరించి ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు..! ఇంట్లో వాళ్లకి కొంత ప్రస్టేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ కి , సాయి ధర్మ తేజ్ కి, మాస్ మహారాజ్ రవితేజ కి ఛాలెంజ్ విసిరారు..!