రెపల్లే సిపిఎం ఆఫీసులో 130వ జయంతి వేడుకలు

రెపల్లే టౌన్: సిపిఎం ఆఫీసులో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని నిర్వహించడం జరిగింది. సిపిఎం రెపల్లే డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ పూలమాల వేసి నివాళులర్పించారు ఆనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా,బలహీన వర్గాలు కోసం అంబేద్కర్ సేవలు గొప్పవని నేటితరం యవతకు అంబేద్కర్ ఆదర్శమని అన్నారు. అంబేద్కర్ చెప్పినా బాటలో బోధించు, సమీకరించు,పోరాడు అనే అవగాహనతో నేడు సీపీఎం పార్టీ సామాజిక సమస్యలుపై ముందుండి పనిచేస్తుందని, దేశంలో నేడు రాజ్యాంగాన్ని విస్మరిస్తూ నల్ల చట్టాలని తీసుకువస్తున్నా నేపథ్యంలో ముస్లింలు,దళితులు బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులు గురిచేయడం జరుగుతుందని ఈ నేపథ్యంలో సీపీఎం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతుందని అన్నారు.సిపిఎం, కెవిపిఎస్,సిఐటియు,ఎస్ఎఫ్ఐ నాయకులు కె.ఆశ్వీరాదం,జె. ధర్మరాజు,కేవీ.లక్ష్మణరావు,బి.నాగరాజు,ఐ.లీలకోటేశ్వరరావు,డి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.