ఫోర్బ్స్ జాబితాలో 52వ స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్
ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జించిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారతదేశం నుంచి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ప్రముఖ గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో 48.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 366 కోట్ల ఆదాయంతో యాక్షన్ స్టార్ ఈ లిస్ట్‌లో 52వ స్థానంలో నిలిచాడు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు సంపాదించిన ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో 590 మిలియన్ డాలర్ల సంపాదనతో 22 ఏళ్ల మోడల్ కైలీ జెన్నెర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్, ఫేమస్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ, నెమార్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు.