ఇండో-చైనా ఉద్రిక్తత పరిస్థితుల ఆధారంగా అజయ్ దేవగన్ కొత్త సినిమా

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగన్, లడఖ్‌లోని గాల్వన్ లోయ లో ఇండో-చైనా మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో చైనా సైన్యంతో పోరాడి అమరులైన 20 మంది భారత ఆర్మీ సైనికుల కథను చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్ ఎఫ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ సంయక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్ర తారాగణాన్ని ఇంకా ఖరారు చేయాల్సిఉంది. కాకపోతే ఈ చిత్రంలో అజయ్ దేవగన్ నటిస్తారా లేకపోతే, అంతా కొత్తవారితో తీస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.