ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా అడుసుమిల్లి నియామకం…

ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా అడుసుమిల్లి వెంకట్రావు నియమితులయ్యారు.
ఈ మేరకు మెగా అభిమానుల రథసారథి, మెగా బ్రదర్ శ్రీ కొణిదల నాగేంద్రబాబు గారు ఒక ప్రకటన విడుదల చేశారు.

15 సంవత్సరాలుగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి వీరాభిమానిగా, తర్వాత్తర్వాత జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన అడుసుమిల్లి వెంకట్రావు సేవలకు గుర్తింపుగా ఈ పదవి ఆయన్ని వరించివచ్చింది.

కరోనా కష్టకాలంలో అన్నార్తులు, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడంతోపాటు విస్తృతంగా అన్నదాన కార్యక్రమాల్ని కూడా వెంకట్రావు నిర్వహించారు.

అంతేకాకుండా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పిలుపు మేరకు అత్యధిక మందితో రక్తదానం చేయించినందుకు శ్రీ నాగేంద్రబాబు గారు ప్రత్యేకంగా ఆయన్ని ప్రశంసించారు.

ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని వెంకట్రావుకి పంపించారు. మెగాభిమానులందర్ని ఏకతాటిపై నడిపిస్తూ, సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేయాలని, చేస్తారని శ్రీ నాగేంద్ర బాబు గారు అభిలషించారు.

ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా వెంకట్రావు పదవీకాలం 27-05-2020 తేదీ నుంచి 26-05-2022 వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

శ్రీ అడుసుమిల్లి వెంకట్రావు నియామకం పట్ల అఖిల భారత చిరంజీవి యువత & రాష్ట్ర చిరంజీవి యువత సంయుక్తంగా హర్షం వ్యక్తం చేశారు.