అడవులలో నిర్మునుష్య ప్రాంతాల్లో ముమ్మరంగా పేకాట జోరు…నిద్రలో నిఘా నేత్రం

నెల్లూరు జిల్లా రాపూరు, పెంచలకోన, గోనుపల్లి, అడవులలో సైదాపురం మండలం కలిచేడు గ్రామాల్లో చెరువులు చెట్ల పొదలు ఖాళీ భూములు మనుషులు తిరగని నిర్మానుష్య ప్రాంతాల్లో ముమ్మరంగా పేకాట జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు వచ్చి లక్షలలో ఆడుతున్నట్లు సమాచారం. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్-విజృంభిస్తున్నందున అధికారులు కరోనా కట్టడి పనిలో ఉండడంతో పేకాట పై నిఘా నేత్రం లేదని ఆటగాళ్లు ఇదే ఆసరా చేసుకొని వారి ఇష్టానుశారంగా పేకాట ఆడే మమ్మలిని పట్టుకోలేరులే అనే ధీమాతో ఉన్నారు. అనేక కుటుంబాలు అప్పుల పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొందరు అధికార పార్టీల నాయకులకు సానుభూతి పరులు కావటం వారు ఆడే పేకాటకు అడ్డంకులు ఎదురు కాకుండా వారికి పోలీస్ శాఖలో కింద స్థాయి సిబ్బంది మాత్రం పేకాట జూదరులకు ముందుగా సమాచారం ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జోరుగా పేకాట సాగుతున్న విషయం తెలిసినా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వటంలో చుట్టుపక్కల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్కసారి అధికారులు ఆటగాళ్ల పై నిఘాపెట్టి పేకాట జూదరుల భరతం పట్టాలని చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు పోలీస్ శాఖను కోరుతున్నారు.