హీరో నితిన్ పెళ్లి వాయిదా..!

రీసెంట్ బ్లాక్ బస్టర్ భీష్మ మూవీ తో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన యంగ్ హీరో నితిన్ , వచ్చే నెల ఏప్రిల్ 16న తను ప్రేమించిన అమ్మాయి శాలిని తో వివాహానికి ముహూర్తం ఖరారైనా విషయం తెలిసిందే.

మొదట నితిన్ ఫ్యామిలీ దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు ,కానీ కరోనా ప్రభావంతో ఏప్రిల్ 14 దాకా దేశమంతటా పూర్తి లాక్ డౌన్ విధించడంతో , డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకొని ఇంట్లోనే కొంతమంది దగ్గర బంధువుల సమక్షంలో వివాహం చేసుకుందాం అనుకున్నారు.

కానీ రోజు రోజు కి కరోనా ప్రభావం పెరుగుతుండటంతో, ప్రస్తుతం 16వ తారీఖు న జరగాల్సిన వివాహం వాయిదా వేసుకున్నట్టు నితిన్ ప్రకటించారు, అలాగే రేపు నా బర్త్ డే నెను సెలబ్రేట్ చేసుకోవడం లేదు ,దయచేసి నా ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేయకుండా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.