పులికనుమ ప్రాజెక్టు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి : తెదేపా రాష్ట్ర కార్యదర్శి

మంత్రాలయం : కోసిగి మండలం లోని దేవరబెట్ట గ్రామం సమీపంలో పులికనుమ ప్రాజెక్టు పంపు హౌస్-2 దగ్గర పైపు లైన్ పలిగి నీరు ఎగిసి పడి పక్క పొలాల్లో కి బారి ఎత్తుగా నీరు రావడంతో దాదాపు 50 ఎకరాలలో నీరు చేరడంతో పంటలు దెబ్బతినడంతో విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకోని పంట పొలాలను పరిశీలించి నీటి మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పులికనుమ ప్రాజెక్టు పంపు హౌస్ మరమ్మతులు చేయాలని పులికనుమ ప్రాజెక్టు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి,తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, సాతూనురు కోసిగయ్య, కోండగేని వీరారెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్, ఖలదర్, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణా రెడ్డి, ఈరయ్య, నాడిగేని వీరారెడ్డి, తాయన్న, కప్పయ్య, భీమయ్య,మహదేవ్, నీలకంఠ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.