అభయ హస్తం నిలిపివేయడం బాధాకరం-పట్టణ యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు

మండపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి , 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం ఆర్థిక అసమర్థత కారణంగా నిలిపి వేయడంచాలా బాధాకరం విషయమని, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అప్ప రా బోతు దుర్గాప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి డ్వాక్రా మహిళలు అందరికీ, 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా ఎంతోకొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. డోక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న ప్రతి మహిళ, రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి 365 రూపాయలు చొప్పున, ఈ పథకం లో జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదికి 365 రూపాయలు చొప్పున చెల్లిస్తుందని, మహిళా వాటా ,ప్రభుత్వ వాటా, రెండూ కలిపి ప్రభుత్వమే ఆ డబ్బును ఎల్ఐసి వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీమ్లో పెట్టుబడిగా పెడుతుంది, సభ్యులకు 60 సంవత్సరాలు నిండిన తర్వాత, సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ 500 రూపాయలు నుంచి, 2600 మధ్య, పెన్షన్ అందుతుందని ,వీటితో పాటు మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే, కుటుంబంలోలో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం ,ఒకవేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే కొంత మొత్తాన్ని భీమా గా చెల్లించడం, ఈ పథకం ప్రధాన ఉద్దేశం ,ఇప్పటికే ఈ పథకం లో మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి 700 మంది ప్రతి నెల పింఛన్లు అందు కుంటున్నారు, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అభయహస్తం ప్రీమియం సొమ్మును ఎల్ఐసి సంస్థ నుంచి” 2000″ కోట్ల నిధిని ప్రభుత్వం డ్రా చేయడంతో, ఎల్ఐసి సంస్థ ఈ పథకం తో మాకు ఎటువంటి సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేయడం, చాలా బాధాకరమైన విషయం అని ,ప్రభుత్వం డ్వాక్రా సంఘాల పై చూపిస్తున్న పనితీరుకు ఇది నిదర్శనం అని ఆయన విమర్శించారు.