రెండోసారి విడాకులు తీసుకుంటున్న ప్రముఖ నటుడు.

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ దాంపత్య జీవితం మరోసారి ముక్కలైంది. తన రెండో భార్య కిరణ్‌రావుతో కూడా ఆయన విడిపోయారు. 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. తమ బిడ్డకు తల్లితండ్రులుగా ఉంటూనే వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇక అమీర్‌ ఖాన్‌ పదిహేనేండ్ల క్రితమే మొదటి భార్యతో విడిపోయి కిరణ్‌రావును రెండో వివాహం చేసుకున్నారు.