లైట్స్ ఆఫ్ చేసి దీపం వెలిగిస్తే కరోనా పోతుందా??

కే ఎన్ టీవీ ఇంటర్నెట్ డెస్క్ :. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కు లైట్స్ ఆఫ్ చేయమని మోడీ ఇచ్చిన పిలుపు మీద రేగిన వివాదం పై జనసేన అది అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాసరావు రావు సోషల్ మీడియా వేదికగా క్రింద విధంగా తీవ్రంగా స్పందించారు.

వెలిగిస్తే కరోనా పోతుందా?? అని కొందరు అడుగుతున్నారు!!.. మరి….5K రన్ పెడితే ఎయిడ్స్ పోతుందా అని, 2K రన్ పెడితే కాన్సర్ పోతుందా అని, క్యాండిల్ ర్యాలీలు తీస్తే స్త్రీలపై హత్యాచారాలు ఆగుతాయా అని ఎవరూ అడగలేదే..

దీపం వెలిగించడంలో ఉన్న సైన్సు మరియు అర్థం, పరమార్థం జోలికి వెళ్ళక్కర్లేదు.

ఈ కార్యక్రమాలన్నీ మనం ఐక్యంగా ఉంటూ స్థైర్యంతో సమస్యను ఎదుర్కొనేందుకు చేసే ప్రయత్నాలకు సంఘీభావంగా అని అనుకుంటే సరిపోతుంది కదా!!!

లేదా 9 నిమిషాలు లైట్లు ఆర్పి కరెంట్ ఆదా చేస్తున్నామనో, భూ ఉష్ణోగ్రత తగ్గిస్తున్నామనో అనుకోవచ్చుగా!!

ప్రతీదీ రాద్దాంతం చేయడమెందుకు???

నేను వెలిగించను అని కొంతమంది అంటున్నారు… మీరు వెలిగించకుంటే కొంపలేం మునగవు అని చాలామంది అనుకుంటున్నారు”