విడాకులు తీసుకున్నప్పటికీ అత్తవారింట్లో మహిళ ఉండొచ్చు

గతంలో ఒక మహిళ ఇష్టపూర్వకంగా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరం కింద పరిగణనలోకి రాదు అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కీలక విషయాల్లో కీలకతీర్పులు వెలువరిస్తున్న సుప్రీంకోర్టు దేశ ప్రజలందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇప్పుడు మరోసారి ఇలాంటి తరహా తీర్పు వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. సాధారణంగా అయితే భార్య భర్తల బంధం మధ్య మనస్పర్థలు ఏర్పడినప్పుడు విడాకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది
అనే విషయం తెలిసిందే.లాయర్ ను సంప్రదించి కోర్టు సమక్షంలో విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇక మహిళలు అత్తవారింట్లో ఉండకుండా పుట్టింట్లో ఉండటం లేదా సపరేట్ గా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. భర్తతో విడిపోయి అత్తమామలతో ఉండాలి అని అనుకున్నప్పటికీ… సాధారణంగా అలాంటి అవకాశం ఉండదు అని మహిళలు అత్తవారింట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇదే విషయంపై ఇటీవలే విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

భర్తతో వివిధ కారణాలతో విడిపోయి విడాకులు తీసుకున్నప్పటికి కూడా మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉంటుంది అంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తమ కొడుకుతో విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ తమ కోడలు ఇంకా తమ ఇంట్లోనే ఉంటుంది అంటూ సతీష్ అనే వ్యక్తి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారించిన సుప్రీంకోర్టు మహిళలకు భర్త నుంచి విడిపోయినప్పటికీ అత్తవారింట్లో ఉండే హక్కు ఉంటుంది అంటూ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.