చీరాల సచివాలయం : మాజీ ఎమ్మెల్యే అనుచరుల గూండాగిరి

ప్రకాశం జిల్లా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గూండా గిరికి హద్దు అదుపు లేకుండా పోతుంది. తాజాగా శనివారం మధ్యాహ్నం వారి అనుచరులు 24వ గ్రామ సచివాలయ (33 వ వార్డు) అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆవుల ఝాన్సీ, మరియు సచివాలయ ఉద్యోగుల పై దాడికి యత్నించారు. వారు చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని లేకపోతే, చంపేస్తామని బెదిరించారు. హెల్త్ సెక్రటరీ ఏ.కళ్యాణి పోలీసులకు ఫోన్ చేయడంతో, పోలీసులు త్వరగా ఘటనా స్థలానికి వచ్చి ఆమంచి కృష్ణమోహన్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆవుల ఝాన్సీ ఫిర్యాదు మేరకు, పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.