ఆంధ్ర కేసరి కి ఘన నివాళి

భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమర యోధుడు,ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారి 149వ జయంతి సందర్భంగా కోడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎం డి ఓ సదా ప్రవీణ్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.’టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడని ఆంధ్ర కేసరి కి ఘన నివాళి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి,కష్టపడి చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు గారని 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒక్కడని. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడని మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి నాగ రేవతి, కార్యాలయ సిబంది సుమతి తదితరులు పాల్గున్నారు.