భారత క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగుతోంది

ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేపట్టిన భారత్‌. తాజాగా యాంటీ షిప్‌ మిసైల్‌ (ఏఎస్‌హెచ్ఎం)ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోర నుంచి ఇండియన్‌ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించిందని వెల్లడించింది. క్షిపణి ఢీ కొట్టడంతో లక్షిత నౌక పేలిపోయి.. పొగలు వస్తున్న ఫోటోను ఇండియన్‌ నేవీ విడుదల చేసింది.