దృశ్యం కి సీక్వెల్ రెడీ..!

మోహ‌న్‌లాల్‌, మీనా జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం “దృశ్యం”, 2013లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ కూడా అయ్యి అన్ని భాషల్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ స‌క్సెస్‌ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా “దృశ్యం 2” తెర‌కెక్క‌నుంది. ఈ విష‌యాన్ని మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం రోజున మోషన్ పోస్టర్ విడుదల చేసి క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. సీక్వెల్‌ను కూడా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయ‌నున్నారు. సీక్వెల్‌లో మోహ‌న్‌లాల్ జంట‌గా మీనా న‌టించ‌నున్నారు.