గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నియంత్రణకు సమీక్షా సమావేశం నిర్వహించారు

నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రోణంకి.గోపాలక్రిష్ణ ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణ పై డివిజన్ లోని కోవిడ్ టాస్క్ ఫోర్స్, వైద్య శాఖ ,రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ రావు హాజరయ్యారు.ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ లో జరుగుతున్న కరోనా టెస్టులు,పాజిటివ్ బాధితుల షిఫ్టింగ్,కరోనా పరీక్షల కిట్స్ ,హోమ్ ఐసోలేషన్ తదితర అంశాల పై డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించామన్నారు.ఇప్పటివరకు డివిజన్ లో 5,550 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ,67 మంది కరోనా తో మృతి చెందారని అన్నారు.ప్రభుత్వం ఇచ్చే సూచనల ప్రకారం కరోనా మరణాల సంఖ్యను తగ్గించే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.