ఏపీలో కొత్త రకం చాక్లెట్లు వచ్చాశాయి..

అబ్బో..కొత్త రకమా..?

ఎలా ఉంటాయో అని టేస్ట్ చేద్దామనుకునేరు…ఊగిపోతారు. మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. అవును నిజం. భంగ్ పేరుతో మత్తు చాక్లెట్లను సర్కులేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇతర రాష్ట్రాల నుంచి వైజాగ్ మీదగా ఏపీలోకి ఈ మత్తు చాక్లెట్ల రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమచారంతో మాటు వేసి ఈ భంగ్ గ్యాంగ్ ఆటకట్టించారు. మనోజ్‌కుమార్‌ చౌదరి, రాజీవ్‌ కుమార్‌ సింగ్, హరహర పాండా అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భంగ్ చాకెట్ల ముఠా విచారించగా పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. మానుక్య ఆయుర్వేదం పేరిట మందుల డబ్బాల్లో భంగ్ చాక్లెట్లను రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. అసలు ఈ పేరుతో ఆయుర్వేద మెడిసిన్ కంపెనీ నిజంగా ఉందా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏపీ సర్కార్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఈజీగా రవాణా అయ్యే భంగ్‌ను అక్రమార్కులు విశాఖపట్నంకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు దీన్ని గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.