మానవ హక్కులపై కనీస అవగాహన అవసరం కావాలి : రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదబాబు

ప్రతి మానవుడు నిరంతరం మానవ హక్కులను తెలుసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరగ విజయశ్రీ భాస్కర్ రావు (పెదబాబు) తెలిపారు. శనివారం పదవి వచ్చిన సందర్భం గా ఆయనకు ఇంద్రపాలెంలో ఉన్న బీసీ ప్రజా సంక్షేమ సంఘం కార్యాలయంలో చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఈ సంఘం జాతీయ స్థాయిలో పని చేస్తుందన్నారు. హక్కులను నిరంతరం తెలియజేసి వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ సంఘం కృషి చేస్తుందని పెదబాబు చెప్పారు. బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లాఅధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ పెదబాబు ఇప్పటి దాకా కాకినాడ రూరల్లోనూ, పండూరులతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పెదబాబు చైర్మన్గా నెహ్రు యువజన సంఘం, కోపరేటివ్ బ్యాంక్, విద్యా కమిటీ, వేణుగోపాల స్వామి దేవస్థానంలకు సేవలు అందించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో పదవి దక్కడానికి చేసిన సేవలే కారణమన్నారు. బహుజన నాయకుడు దాకారపు చిట్టిబాబు మాట్లాడుతూ పెదబాబుకు చిన్ననాటి నుండి సేవ చేసే గుణం ఉండటం వల్లనే ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్ష పదవి బహుమతిగా వచ్చిందన్నారు. పార్లమెంటు పరిధిలో కాపు సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్ష పదవి నిర్వహిస్తున్నారని చిట్టిబాబు చెప్పారు. అనంతరం దళిత, బడుగు వర్గాలకు చెందిన నేతలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రాయుడు మోజెస్ బాబు, పంపన మురళి, అడపా ఏసు, అనసూరి సతీష్, చిన్నా, నాగేశ్వరరావు, వీరేంద్ర, వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.