బంగ్లాదేశ్ టూర్ లో తొలి వన్డేకి ముందు టీమిండియాకు భారీ షాక్
బంగ్లాదేశ్ టూర్ కి సిద్ధమైన టీమిండియా. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలు పెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనుండటంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. తొలి వన్డేకి ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చేతికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కుగా ఉన్న కారణంగా అతను మూడు వన్డేల సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. వన్డే సిరీసే కాకుండా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న షమీ. ట్రైనింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు.వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాఈ రెండు టెస్ట్‌లను గెలవాలి.గాయపడ్డ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి ఎంపిక చేసింది బీసీసీఐ. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ లో రెండు వన్డేలు ఆడి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.