అంధ విద్యార్థులకు బ్రెయిలీ బుక్స్ అందిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ డా. కృతిక శుక్లా

కాకినాడ : తిమ్మాపురం గ్రామంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వై డి రామారావు పాఠశాల సందర్శించి పిల్లలకు కావలసిన మౌలిక వసతుల పై ఆరా తీశారు. కలెక్టర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హైజినిక్ కిట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, పంపిణీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ అంధ విద్యార్థులకు త్వరలో బ్రెయిలీ లిపి బుక్స్ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి కర్రీ శ్రీనివాసరావు, పోర్టు అధికారి మురళీధర్, రెడ్ క్రాస్ సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.