ప్రత్యామ్నాయం చూపెట్టే జీవో ఇవ్వాలి.
ఫ్లెక్సీ ప్రింటింగ్ నిషేధానికి ముందు ప్రభుత్వం నిర్వాహకులుకు ప్రత్యామ్నాయం చేపట్టె జీవో ఇవ్వాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బిసి ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్. ఏపూరి శ్రీనివాసరావు కోరారు.ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఫ్లెక్సీ ప్రింటింగ్ నిషేధించడం కన్నా ముందుగా జీవో నెంబర్ 65లో చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూపాలి… తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ రుణాలు అందించి ఫ్లెక్సీ నిర్వాహకులకు సాయం అందించాలి.. ఈనెల 26 నుండి జీవో నెంబర్ 65 అమలులోకి వస్తున్నందున ప్లెక్సీలు ప్రింటింగ్ నిలిచిపోనున్నాయి.. ఫ్లెక్సీ నిర్వాహకులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.. ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు