నవంబర్ 30న 83 మూవీ ట్రైలర్.

1983 ప్రపంచకప్​ ఆధారంగా తీస్తున్న సినిమా ’83’. ఈ చిత్ర ట్రైలర్​ను మంగళవారం(నవంబరు 30) రిలీజ్ చేయనున్నారు. ఇందులో కపిల్​దేవ్ పాత్రను రణ్​వీర్ సింగ్, అతడి భార్యగా దీపికా పదుకొణె నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మి విర్క్, తాహిర్ బాసిన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కబీర్​ ఖాన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 24న ఈ సినిమాను థియేటర్లలోకి రానుంది.