ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ప్రమాణ స్వీకారం చేసిన వారి లో జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ, జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు .