అంతరిక్షంలో కి వెళ్లి తిరిగివచ్చిన చింపాంజీకి.. 60 ఏళ్ళు

అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే పర్యాటకులను స్పేస్‌లోకి తీసుకెళ్లేందుకు పలు ప్రైవేటు సంస్థలు సిద్ధమవుతున్నాయి. కాగా, తొలిసారిగా అంతరిక్షంలోకి చింపాంజీ ఒకటి 60 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పయనమై విజయవంతంగా తిరిగొచ్చింది. హైమ్‌ అనే చింపాంజీ అంతరిక్షంలో ప్రయాణించిన తొలి జంతువుగా రికార్డు సృష్టించింది. దీని ప్రయాణం తర్వాత అంతరిక్షం వైపు మనిషి ప్రయాణం మరింత సులువుగా మారిందని చెప్పవచ్చు. 1961 జనవరి 31 న నాసా ఆధ్వర్యంలో ప్రయోగించిన రాకెట్‌లో హైమ్‌ అనే చింపాంజీ ప్రయాణించింది. అంతరిక్షంలో మానవులు ఎలాంటి ప్రభావాలను చూపుతుందో తెలుసుకోవడం ఈ మిషన్ యొక్క ఉద్దేశ్యం.

కామెరూన్ అడవులలో హామ్ ను గుర్తించారు. ఫ్లోరిడాకు తీసుకువచ్చి మయామి రేర్ బర్డ్ సంస్థలో దాన్ని సురక్షితంగా ఉంచారు. 1959 లో హామ్‌ను అంతరిక్షంలో శిక్షణ కోసం వైమానిక దళ స్థావరానికి తీసుకెళ్లారు. హామ్‌ను # 65 అని, చాంగ్ అని పేరుపెట్టారు. 18 నెలల శిక్షణ తరువాత హామ్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసి ఫ్లోరిడా ద్వీపంలోని లాంచ్ ప్యాడ్‌కు తరలించారు. ప్రాజెక్ట్ మెర్క్యురీ (ఎంఆర్‌-2) కింద హామ్‌ను ప్రత్యేక కంటైనర్‌లోకి ఎక్కించి అంతరిక్షంలోకి పంపారు.

రాకెట్‌ బయల్దేరిన 16:30 నిమిషాల తరువాత హామ్ అంతరిక్షానికి చేరుకున్నది. హామ్‌ 5,800 కిలోమీటర్ల వేగంతో 157 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. భూమికి తిరిగి వచ్చేటప్పుడు హామ్ ప్రయాణిస్తున్న క్యాప్సూల్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో 130 కి.మీ. వేగంతో పడిందిజ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తరువాత హామ్‌ను 1963 లో వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో ఉంచారు. ఈ చింపాంజీ 1983 జనవరి 19 న మరణించింది. ఈ ప్రయోగం అనంతరం మానవులను అంతరిక్షంలోకి పంపడం చాలా సులువగా మారింది.