తెలంగాణలో కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో శనివారం భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసులు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు 7,072 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,363గా ఉంది. వ్యాధి నుంచి కోలుకుని శనివారం 154 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,506 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఇవాళ ఐదుగురు చనిపోయారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 203 మంది మరణించారు.