2022సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారులు వీరే

తమ ఆటతీరుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న  పలువురు క్రీడాకారులు   అనూహ్యంగా 2022సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అలా ఈ ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన వారెవరో తెలుసుకుందాం …

మిథాలీ రాజ్  క్రికెట్ కెరీర్‌ను ఈ ఏడాది జూన్ 8న ముగించింది. మిథాలీ రాజ్ 2019లో టీ20 ఇంటర్నేషనల నుంచి రిటైరైంది. 1999లో 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసింది. వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఆమె. ఆమె కెరీర్‌లో 7805 పరుగులు ఉన్నాయి. ఇందులో 7 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు ఉన్నాయి.Mithali Raj wants Indo-Pak final but says India need to produce A-game to  beat England in semis | Sports News,The Indian Express

ఝులన్ గోస్వామి : టీమిండియా మహిళా క్రికెటర్‌ ఝులన్ గోస్వామి ఈ ఏడాది సెప్టెంబర్‌ లో రిటైర్‌మెంట్ ప్రకటించింది.  12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు తీసిన ఝులన్ గోస్వామి.

This Journey Has Been The Most Satisfying' - Jhulan Goswami Pens Heartfelt  Retirement Note

సెరెనా : ఈ ఏడాది ఆగస్టులో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని తర్వాత US ఓపెన్ ఆమె చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌గా పేర్కొంది. సెరెనా తన కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లను, తన అక్క వీనస్‌తో కలిసి 14 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.

Serena Williams: సలామ్‌ సెరెనా

ఆష్లే బార్టీ  : నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యువ టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ వరుసగా 114 వారాల పాటు WTA ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ప్లేయర్.

Ashleigh Barty : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత..ఆష్లే బార్టీ

రోజర్ ఫెదరర్  టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ తన కెరీర్‌ను లావర్ కప్ 2022తో ముగించాడు. రాఫెల్‌ నాదల్‌తో కలిసి వీడ్కోలు మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌ తర్వాత నాదల్‌, ఫెదరర్‌ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. ఫెదరర్ తన కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *