కేరళలో కలకలం – 19 నోరోవైరస్ కేసులు
కేరళలో 19 నోరోవైరస్ కేసులు నిర్ధారణ కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రంలో ఈ వైరస్‌ని గుర్తించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ గుర్తించడంతో ప్రభత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుంది. చికిత్స సులభమే అయినప్పటికీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎర్నాకుళంలోని ఒక పాఠశాలలో కనీసం 19 మంది విద్యార్థులు పాజిటివ్ గా పరీక్షించడంతో.. 50 పాఠశాలలను ముందస్తుగా మూసివేశారు. చాలా మంది విద్యార్థులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా నోరోవైరస్ యొక్క లక్షణాలు 1 రోజు నుంచి 72 గంటల మధ్య ఉంటాయి. దాని కంటే ఎక్కువ కాలం పాటు లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించారు. నోరో వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. సరైన నివారణ, చికిత్సతో, వ్యాధి త్వరగా నయమవుతుందని ప్రజలకు సూచించారు.