సెన్సార్ పూర్తి చేసుకున్నా మహేష్ బాబు సర్కారు వారి పాట

 మహేష్ బాబు,కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం నేపథ్యంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిన్నారు. ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. అంతేకాదు, రన్ టైమ్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. 2 గంటల 42నిమిషాల నిడివితో సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘కళావతి’, ‘పెన్నీ’.. లిరికల్ వీడియో సాంగ్స్ వచ్చి అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.